Tuesday, March 10, 2026
E-PAPER
Homeసినిమాఆసక్తికర కంటెంట్‌తో 'విక్రమ్‌ ఆన్‌ డ్యూటీ'

ఆసక్తికర కంటెంట్‌తో ‘విక్రమ్‌ ఆన్‌ డ్యూటీ’

- Advertisement -

బిగ్‌బాస్‌ విన్నర్‌ నిఖిల్‌ మలియక్కల్‌ హీరోగా, బ్రహ్మ రుద్ర దర్శకత్వంలో రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘విక్రమ్‌ ఆన్‌ డ్యూటీ’. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై ప్రవీణ, అనిల్‌ కడియాల నిర్మించారు.
జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ఈ సిరీస్‌ టాప్‌ వన్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ,’ఈ వెబ్‌ సిరీస్‌లో కొన్ని గ్లింప్స్‌ చూశాను. హంట్‌ అనే యూనిట్‌ ద్వారా క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ జరుగుతుంది. హంట్‌తో టాలెంట్‌ హంట్‌ జరగడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. కొత్త మ్యూజిక్‌ డైరెక్టర్‌ సుహాస్‌కి ఆల్‌ ది వెరీ బెస్ట్‌. తన మ్యూజిక్‌ బిట్స్‌ బావున్నాయి. ఇది ఆల్రెడీ నెంబర్‌ వన్‌ స్ట్రీమింగ్‌లో ఉందని తెలిసింది. హాట్‌స్టార్‌కి కంగ్రాజులేషన్స్‌. హర్ష తన అనుభవాన్ని రంగరించి చేస్తున్నారు. చిన్నప్పుడు కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్‌ నవల చదివాను. అందులో డిటెక్టివ్‌ తన బ్రెయిన్‌ ఉపయోగించి కొన్ని నేరాలని పరిశోధిస్తుంటాడు. అలాగే మధుబాబు నవలల్లో యాక్షన్‌ కూడా ఉంటుంది. ఈ సిరీస్‌లో ఆ రెండూ ఉంటాయని ఆశిస్తున్నాను. చివరిగా ఒక హుక్‌ లైన్‌ ఇవ్వాలంటే.. విక్రమ్‌ ఆన్‌ డ్యూటీ బికాస్‌ ఆఫ్‌ హర్ష అఫ్‌ డ్యూటీ’ అని అన్నారు.
‘హర్ష, ప్రవీణ్‌, అనిల్‌.. టీమందరం కలిసి ఒక మంచి టీం వర్క్‌తో ఈ ప్రాజెక్ట్‌ చేశాం. జియో హాట్స్టార్‌ నుంచి నందినికి, రమణకి థ్యాంక్యూ సో మచ్‌. ఆస్కార్‌ విజేత కీరవాణి ఈ వేడుకకు రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆషు చాలా అద్భుతంగా పెర్ఫార్మ్‌ చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అని బిగ్‌ బాస్‌ విన్నర్‌ నిఖిల్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -