నవతెలంగాణ-హైదరాబాద్ : జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారించాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ) ఆద్వర్యంలో సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలాకు వినతిపత్రం అందజేశారు.
వినతిపత్రంలో.. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కల్పించాలని కోరారు. అదేవిధంగా, ఇళ్ల స్థలాల పంపిణీని త్వరగా పూర్తి చేయాలని, జర్నలిస్టులకూ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ స్కీం అమలు చేయాలని, రాత్రిపూట పనిచేసే మహిళ జర్నలిస్టులకు ఉచిత రవాణ సౌకర్యం కల్పించాలని కొరారు.
ఈ సందర్భంగా హెచ్‌యూజే ప్రతినిధులు మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.






