- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను సోమవారం విచారించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. విరాళాల చోరీ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీకీ)కి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వచ్చే వారం విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. సిట్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
- Advertisement -



