Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేగులగూడెంలో శుభ్రతా కార్యక్రమం

రేగులగూడెంలో శుభ్రతా కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం రేగులగూడెం గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం రోడ్ల శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ పాగే ఆమని సురేష్ ఆధ్వర్యంలో గ్రామంలోని రోడ్లు, పరిసరాలను శుభ్రపరిచి పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఆమని సురేష్ మాట్లాడుతూ…ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. గ్రామ ప్రజలు పరిశుభ్రతను పాటిస్తూ రోడ్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అలాగే గ్రామాన్ని అందంగా, ఆరోగ్యకరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి బండారి కృష్ణవేణి, ఫీల్డ్ అసిస్టెంట్ భూతం రాజబాబు, గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -