శనగ పంట మద్దతు ధర కొనుగోలు వెంటనే ప్రారంభించాలి
ప్రజావాణిలో రైతుల వినతి
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలో శనగ పంట కొనుగోలు ప్రారంభించేదేన్నడో.. పంట చేతికొచ్చినా ప్రారంభించని శనగ పంట కొనుగోలు కేంద్రాలు.. దళారులకు అమ్ముకుంటున్న రైతులు నష్టపోతున్నామని ఆవేదన శీర్షిక సోమవారం నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది. శనగ పంట రైతులు సోమవారం తాసిల్దార్ కార్యాలయానికి తరలివచ్చి శనగ పంట కొనుగోలు వెంటనే చేపట్టాలని ప్రజావాణి కార్యక్రమంలో రైతులు తాసిల్దార్ ఎండి ముజీబ్ కు అదే విధంగా మండల వ్యవసాయ అధికారి రాజుకు వేరువేరుగా వినపత్రాలు అందజేశారు. రైతుల వినతి పత్రాల సమాచారాన్ని వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తానని తాసిల్దార్ ఎండి ముజీబ్ రైతులకు తెలియజేశారు. వ్యవసాయ శాఖ అధికారి రాజు కూడా రైతుల విన్నపాన్ని గురించి సంబంధిత జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శనగ పంట రైతులు పాల్గొన్నారు.
నవతెలంగాణ కథనానికి స్పందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



