సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి తాజాగా విడుదలైన శక్తివంతమైన గ్లింప్స్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేపుతోంది.
పవన్ కళ్యాణ్ అద్భుతమైన, కమాండింగ్ అవతార్‌లో కనిపించిన ఈ గ్లింప్స్.. ప్రేక్షకులు తెరపై చూడటానికి ఇష్టపడే మాస్ ఎనర్జీ, చరిష్మాను సంపూర్ణంగా సంగ్రహించింది. ఈ గ్లింప్స్ విడుదలైన క్షణం నుంచే సామాజిక మాధ్యమాల్లో అద్భుతమైన స్పందన లభిస్తోంది.
అభిమానులు ‘కల్ట్ కెప్టెన్’ అని ముద్దుగా పిల్చుకునే దర్శకుడు హరీష్ శంకర్, ప్రేక్షకులు ఆరాధించే విధంగా పవన్ కళ్యాణ్‌ను మరోసారి ఉత్తేజపరిచే రీతిలో ప్రదర్శించడంలో సఫలమయ్యారు. ఈ గ్లింప్స్ సినిమా తాలూకా తీవ్రతను, పవర్ స్టార్ పాత్రను మరింత బలంగా చూపించే విధంగా రూపొందింది. గ్లింప్స్‌కు వస్తున్న అద్భుతమైన స్పందనపై చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇది చిన్న భాగం మాత్రమేనని, త్వరలో విడుదల కానున్న ట్రైలర్‌తో మరింత ఉత్సాహం పెరుగుతుందని చిత్రబృందం హామీ ఇచ్చింది.
దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి పాటలను స్వరపరచగా, ఎస్.తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ‘గబ్బర్‌సింగ్’ తరువాత పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా ఈనెల 19వ తేదీన థియేటర్లలో అడుగుపెట్టనుంది.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.
అంచనాలు పెంచేలా..
- Advertisement -
- Advertisement -



