బృహస్పతి ఎంటర్టైన్మెంట్స్, అప్పారెంట్లీ సినిమా, స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘లేచింది మహిళాలోకం’. దర్శక ద్వయం అర్జున్-కార్తిక్ రూపొందించిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి, శ్రీరామ చంద్ర, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం ఈనెల 26న థియేటరల్లో విడుదలకు సిద్ధమవుతోంది. సన్‌స్టూడియో యూఎఫ్‌ఓతో కలిసి ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సోమవారం ప్రసాద్ ల్యాబ్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది.
నిర్మాతలు మాట్లాడుతూ, ‘ఇండిస్టీ మాకు కొత్త. మొదటి ప్రయత్నంలోనే ఇంత మంచి సినిమా తీశాం. అందరూ మా సినిమాని థియేటర్స్‌లో చూసి ఆశీర్వదిస్తే, ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాం’ అని అన్నారు. ‘మా మహిళామణులు అందరూ ఎంతో చక్కగా సహకరించారు. అందుకే సినిమా అవుట్ పుట్ ఇంత బాగా వచ్చింది. ఇది పూర్తిగా ఫన్ మూవీ అందరికీ నచ్చుతుంది’ అని దర్శక ద్వయం అర్జున్, కార్తిక్ చెప్పారు.
ఏపీ, తెలంగాణ యూఎఫ్ఓ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ మాట్లాడుతూ, ‘సినిమా చూశాను. చాలా బాగుంది. ఇంత మంచి సినిమాను ప్రేక్షకుల దగ్గరికి ఎలాగైనా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నా. అందుకే రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చా’ అని తెలిపారు. నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ, ‘మేము చిన్న సినిమా చేసినా.. అద్భుతమైన సినిమా చేశాం. ఇది మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు. అందరినీ నవ్వించే చిత్రం’ అని అన్నారు.
ఆద్యంతం నవ్విస్తాం
- Advertisement -
- Advertisement -



