- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ ఇటీవల ఉప సర్పంచ్ ల ఫోరమ్ భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్భంగా మంగళవారం గ్రామపంచాయతీలో సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో రాజును శాలువాతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్ లో ప్రజలకు సేవలందిస్తూ మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఇందారపు చెంద్రయ్య, సారయ్య, తిర్రి అశోక్, పైడాకుల దేవేంద్ర-సమ్మయ్య, కామ బాపు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



