Wednesday, July 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆగస్టు 2 నుంచి గీతన్నల చైతన్య యాత్ర

ఆగస్టు 2 నుంచి గీతన్నల చైతన్య యాత్ర

- Advertisement -

ప్రభుత్వ హామీలు అమలు చేయాలి
కార్మికుల ప్రమాద ఎక్స్‌‌గ్రేషియా బకాయిలు విడుదల చేయాలి : కల్లుగీత కార్మిక సంఘం 
రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల రమణ
నవతెలంగాణ – ముషీరాబాద్

​​కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించనున్నామని రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల రమణ ప్రకటించారు. హైదరాబాద్‌ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో కల్లు గీత కార్మికుల పెన్షన్ రూ.4 వేలు, ఎక్స్‌ ‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పి ఇప్పటివరకు దాని గురించి ప్రస్తావనే తేవడం లేదని విమర్శించారు. వృత్తి నిర్వహణలో ప్రమాదాలకు గురైన కార్మికులకు ఇవ్వాల్సిన సుమారు రూ.20 కోట్ల ఎక్స్‌గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పాలని, వృత్తి చేసే వారందరికీ వెంటనే కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని కోరారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ చైతన్య యాత్ర ఆగస్టు 2న మహబూబాబాద్ లో ప్రారంభమై అన్ని జిల్లాల్లో తిరిగి.. 18న హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ముగుస్తుందని వివరించారు. యాత్రలో గీత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మెన్ బాలగోని బాలరాజు గౌడ్, టాడి కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పల్లె రవికుమార్ గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, కేఆర్ టీవీ ఛానల్ అధినేత క్రాంతి తదితర నాయకులు హాజరై చైతన్య యాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు, వి.వెంకట నరసయ్య, గౌని వెంకన్న, బాల్నే వెంకట మల్లయ్య, గౌని సాంబయ్య, రాష్ట్ర కార్యదర్శులు చౌగాని సీతారాములు, మడ్డి అంజిబాబు, ఎస్ రమేష్ గౌడ్, ఎస్ వెంకట్ గౌడ్, బూడిద గోపి, యమగాని వెంకన్న, కొండం కరుణాకర్, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -