Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫామ్ ఆయిల్ దీర్ఘకాలిక ఆదాయం 

ఫామ్ ఆయిల్ దీర్ఘకాలిక ఆదాయం 

- Advertisement -

గెలల సేకరణ కేంద్రం ప్రారంభం 
వ్యవసాయ అధికారిణి భవాని 
నవతెలంగాణ – నసురుల్లాబాద్  

ఆయిల్ ఫామ్ ఒకసారి నాటితే 25-30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుందని.. ఇది రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని, రైతులు గెలల సేకరణ కేంద్రాన్ని సద్వినిగం చేసుకోవాలని నసురుల్లాబాద్ మండల వ్యవసాయ అధికారిణి భవాని సూచించారు. మంగళవారం మండలంలోని అంకుల్ తండా గ్రామ శివారులో హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రాన్ని నసురుల్లాబాద్ మండల వ్యవసాయ అధికారిణి భవాని, హార్టికల్చర్ అధికారి శ్రీకాంత్ , ఆయిల్ ఇండస్ట్రీ జిల్లా అధికారి రవి చంద్రబాబు లు పామ్ ఆయిల్ గెలల సేకరణ కేంద్రంను  ప్రారంభించారు.

ఈ సందర్భంగా రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో  మండల వ్యవసాయ అధికారిని భవాని మాట్లాడుతూ లాభసాటిగా ఉన్న ఆయిల్ పామ్ తోటలను పెంచి రైతులు ఆర్థికంగా పురోగతి సాధించాలన్నారు. పంటల సాగులో సమతుల్యతను పాటించాలని, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు.

ఫామ్ ఆయిల్ గెలలకు మంచి గిట్టుబాటు 
ఆయిల్ పామ్ గెల ధర టన్నుకు రికార్డు స్థాయిలో సుమారు 21 వేలకు పైగా ధర నిర్ణయించారని తెలిపారు. ముడి పామాయిల్ అమ్మకాలు, రికవరీ శాతాన్ని బట్టి ప్రభుత్వం ఈ ధరను పెంచిందన్నారు.. ఇది గతంలో ఉన్న ధరల కంటే దాదాపు 8 వేల నుంచి 9 వేల వరకు ఎక్కువ పెరిగిదన్నారు. ఇది రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తోందన్నారు. పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువగా వచ్చే ఆయిల్ ఫామ్ తోటలను పెంచాలని తెలిపారు. ఉద్యానవన పంటలలో ప్రస్తుతం మార్కెట్ ఉన్న పంట ఆయిల్ పామ్ మాత్రమే, ఆయిల్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని సాగు చేసే పంట రైతులు అమ్మడానికి కూడా ఇబ్బందులు లేకుండా ఫామ్ ఆయిల్ సాగు పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రోత్సాహం అందిస్తుంద‌ని తెలిపారు.

సబ్సిడీ కింద మొక్కలు డ్రిప్పు అందించడమే కాకుండా, నాలుగేళ్ల పాటు నిర్వహణ ఖర్చులు కూడా ఇస్తుంది. దిగుబడి ప్రారంభమయ్యే లోపు అంతర్ పంటల ద్వారా సాగు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. వరి పత్తి పంటలతో పోలిస్తే పెట్టుబడి కూడా తక్కగానే ఉంటుంది. అలాగే తక్కువ శ్రమతో అదిక లాభాలు సాధించే అవకాశం ఉంని. రైతులు సంప్రదాయ పంటల నుంచి ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధిక సబ్సిడీలతో పాటు గ్యారెంటీ ధర కల్పిస్తున్నందున దళారుల ప్రమేయం లేకుండా లాభాలు నేరుగా రైతులకే అందుతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంజుల బాబు, ఉప సర్పంచ్, సరి చందు నాయక్, ఐలి ఇండస్ట్రీస్ సీనియర్ మేనేజర్, శ్రీనివాస్ గౌడ్, ఏరియా మేనేజర్ విక్రమ్, ఫీల్డ్ ఆఫీసర్ రూప్ సింగ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -