నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని బస్వాపూర్ పరిధిలో ఉన్న కేజీబీవీ గురుకుల పాఠశాలలో వికలి ఎంపీడీవో శ్రీనివాస్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కస్తూర్బా పాఠశాలలో వంట గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ వంటగదిలను పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు తెలిపారు. అనంతరం కూరగాయలను తాజాగా తిన్నాయా లేదా అని సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు పౌష్టికారం అందించే విషయంలో ఎటువంటి అలసత్వం వహించరాదని వంట ఏజెన్సీ వారికి సూచించారు.
తాజాగా కూరగాయలు తీసుకురావాలని రుచికరమైన వంటకాలు నిర్వహించి మెనూ ఖచ్చితంగా పాటించాలని అన్నారు. కోడిగుడ్లు, చికెన్ , మాంసం పెట్టే సమయంలో విద్యార్థులకు కడుపునిండా భోజనం అందించాలని అన్నారు. త్రాగునీటి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించి ట్యాంకులను శుభ్రపరచాలని ప్రత్యేక అధికారికి సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి పరీక్షలు నిర్భయంగా రాయాలని ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కాంపిటేటివ్ గా చదివి జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస తో పాటు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, కేజీబీవీ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు .



