నవతెలంగాణ – జుక్కల్
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమంలో 6వ రోజు సందర్భంగా గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎడ్గి గ్రామపంచాయతీ గ్రామం లో రోడ్లు, మురుగు కాలువల శుభ్రపరిచే కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామ నర్సరీని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. గ్రామాభివృద్ధికి గ్రామస్తుల సహకారంతో అవసరం ప్రతి ఒక్కరు అభివృద్ధిలో తమ వంతుగా కృషి చేయాలని మంచి సలహాలు సూచనలు చేసి గ్రామాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని సర్పంచ్ అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీఓ రాము , గ్రామ సర్పంచ్ అనిల్ , గ్రామ కార్యదర్శి రమేష్ , ఉప సర్పంచ్ ఫయ్యూమ్, ఎఫ్ ఎస్ సుభాష్, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు మారోతి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
పెద్ద ఎడ్గిలో ప్రజాపాలనలో భాగంగా శుభ్రతా కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



