నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మైబాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ మారుతి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగిందని జిపి కార్యదర్శి సుదీర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన గ్రామసభ కార్యక్రమంలో జిపి కార్యదర్శి సుధీర్ గ్రామానికి సంబంధించిన పలు అంశాలను, సమస్యలను గ్రామ సభలో చదివి వినిపించారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ గ్రామస్తులు తమ వంతుగా సహకారం అందించాలని గ్రామ సర్పంచ్ పేర్కొన్నారు.
మొదటగా గ్రామంలో శానిటేషన్ పనులు నిర్వహించాలని, 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాన్ని సుందరవణంగా తయారు చేసుకుందామని ప్రతి ఒక్కరు ఈ ప్రణాళికలో కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని పలు సమస్యల గురించి గ్రామస్తులతో చర్చించారు. అదేవిధంగా గ్రామంలోని ఇందిరమ్మ గృహాల పురోగతి, శిశు సంక్షేమం, నీటి సమస్యలు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు , ఇంటి పన్నులు, ఉపాధి హామీ పనులు నిర్వహణ, ప్లాస్టిక్ వస్తువుల వాడకంపై అవగాహన కార్యక్రమాలను మొదటగా నిర్వహించాలని సభా అంశాలను చర్చించి తీర్మానించడం అయినది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ జిపి కార్యదర్శి, గ్రామ మహిళ సంఘాల సభ్యులు, గ్రామస్తులు, యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



