Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడవాలి 

ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడవాలి 

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలి, ఎందుకంటే ఇది జీవునికి, దేవునికి మధ్య వారధిగా ఉంటూ, మానసిక ప్రశాంతతను, మోక్షాన్ని ప్రసాదిస్తుందని ఇట్లా కృష్ణ మహారాజు సూచించారు. నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో నిర్వహించిన హనుమాన్ స్వాముల భిక్ష కార్యక్రమానికి  హాజరై ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మహారాజ్ మాట్లాడుతూ దైవచింతన, భక్తి మార్గం ద్వారా ప్రశాంతమైన జీవితం, ధర్మ పరిరక్షణ జరుగుతుందని అన్నారు. ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -