Tuesday, March 10, 2026
E-PAPER
Homeజిల్లాలుప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్

ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాస్ (మ్యాథ్స్) ను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మంగళవారం సస్పెండ్ చేసినట్లు మండల విద్యాధికారి చందర్ తెలిపారు. శనివారం  బొమ్మన్ దేవ్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాస్ మ్యాథ్స్, రామోజీ శ్రీనివాస్ తెలుగు ఎన్నికల సర్వే ఇఎల్ ఎస్ సెలవుల విషయంలో గొడవ జరిగింది. దీనితో పోలీస్ కేసు నమోదు కావడం జరిగింది. ఈ గొడవలో తిట్టుకోవడ, కొట్టుకోవడంతోవిధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నంద్యాల శ్రీనివాస్ పై చర్యల్లో భాగంగా  ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ అయినట్లు మండల విద్యాధికారి చందర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -