Wednesday, March 11, 2026
E-PAPER
Homeసినిమాగిరిజన మహిళ సత్యవతిగా..

గిరిజన మహిళ సత్యవతిగా..

- Advertisement -

గోపీచంద్‌, దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి కాంబోలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి భారీ స్థాయిలో ఓ హిస్టారికల్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌ కుమార్‌ ప్రజెంట్స్‌ చేస్తున్న ఈ చిత్రం గోపీచంద్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రాలలో ఒకటిగా రూపొందుతోంది. ఈ చిత్రంలో గోపిచంద్‌ సరసన రీతు వర్మ కథానాయికగా నటిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె పోషిస్తున్న పాత్ర సత్యవతిని ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ద్వారా పరిచయం చేశారు. ఈ సినిమాలో రీతూ వర్మ పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారు.
7వ శతాబ్దంలో పర్వత ప్రాంతాల్లో నివసించే ఒక గిరిజన తెగకు చెందిన మహిళగా ఆమె పాత్ర ఉంటుంది.

ఆ తెగ సంస్కృతి, ధైర్యం, సహనాన్ని ప్రతిబింబించేలా సత్యవతి పాత్ర రూపుదిద్దుకుంది. తన నటన ద్వారా రీతూ వర్మ ఆ పాత్రకు సహజత్వం, భావోద్వేగాలను తీసుకురానున్నారు. ఇన్నోవేటివ్‌ కథనాలు, టెక్నికల్‌ ఫినెస్‌కు పేరొందిన దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు. సినిమా విజువల్‌ వండర్‌గా ఉండబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. అలాగే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా ఏకకాలంలో కొనసాగుతున్నాయి అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి దర్శకత్వం: సంకల్ప్‌ రెడ్డి, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, సమర్పణ: పవన్‌ కుమార్‌, సినిమాటోగ్రాఫర్‌: సౌందర్‌ రాజన్‌, ఎడిటర్‌: చోటా కె ప్రసాద్‌, ఫైట్‌ మాస్టర్స్‌: వెంకట్‌, పృథ్వీ, రియల్‌ సతీష్‌, డ్యాన్స్‌ మాస్టర్స్‌: శంకర్‌, విజయ్ పోలంకి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -