ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సుయోధన’. సాయికుమార్, ప్రేమ కీలకపాత్రలు పోషించారు. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ,’మంచి కథా కథనాలతో, అత్యత్తమ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
ప్రియదర్శి, సాయికుమార్, ద్రిషిక చందర్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. జై క్రిష్ అత్యద్భుతంగా సంగీత దర్శకత్వం వహించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందర్ని అలరిస్తాయి. త్వరలో ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలను రిలీజ్ చేస్తాం. శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా మా సినిమా రిలీజ్ అవుతోంది’ అని తెలిపారు. విష్ణు (లడ్డు), దేవి ప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు నటించిన ఈచిత్రానికి మ్యూజిక్ : జై క్రిష్, డీఓపీ : కార్తీక్ కొప్పెర, ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి, నిర్మాత : బోసుబాబు నిడుమోలు, దర్శకత్వం: వై ఎస్ మాధవ్ రెడ్డి.
‘సుయోధన’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



