– బాధితుడికి తిరిగి అందజేసిన ఎస్ హెచ్ ఓ ఎస్ఐ యయాతి రాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను సీఈఐఆర్ (సెంటర్ ఇక్వూప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా గుర్తించి రికవరీ చేసిన అశ్వారావుపేట పోలీసులు గురువారం బాధితుడికి తిరిగి అందజేశారు. ఎస్ఐ యయాతి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల జూన్ 10 న అశ్వారావుపేట కోనేరు బజార్ కు చెందిన మువ్వా రామకృష్ణ తన రియల్‌మీ మొబైల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. దీంతో అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు మేరకు పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్‌ను ట్రేస్ చేసి రికవరీ చేశారు. అనంతరం బాధితుడు మువ్వా రామకృష్ణకు మొబైల్‌ను అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి తిరిగి అందజేసే అవకాశం ఉందని ప్రజలకు సూచించారు.



