– వర్ధంతి సందర్భంగా కేటీఆర్ నివాళి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బాలికల చదువు కోసం బాటలు వేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తెలిపారు. ఆడపిల్లలు చదువుకుంటేనే సమాజం సంపూర్ణంగా బాగుపడుతుందని భావించి, వారికి విద్యనందించడంలో ఆమె ఎనలేని కృషి చేసిన ధైర్యశాలి అని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ కూడా సమానత్వం కోసం పాటుపడిన సావిత్రిబాయి ఫూలే జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. బాలికలతోపాటు దళితులకు విద్యనందించడంలో, వితంతువుల జీవితాల్లో వెలుగులు నింపడంలో, రోగులకు సేవ చేయడంలో ఆమె దిక్సూచిగా నిలిచారని పేర్కొన్నారు. సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా ఆమెకు కేటీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు.
బాలికల చదువు కోసం బాటలేసిన సావిత్రిబాయి ఫూలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



