Wednesday, March 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమున్సిపల్‌ సమావేశం రసాభాస

మున్సిపల్‌ సమావేశం రసాభాస

- Advertisement -

– చొక్కాలు పట్టుకున్న కౌన్సిలర్లు..!
– తీవ్ర ఉద్రిక్తత.. నిలువరించేందుకు పోలీసుల యత్నం
– చాంబర్‌ ఎదుట బైటాయింపు
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ సర్వసభ్య మొదటి సమావేశంలో కాంగ్రెస్‌, బీజేపీ కౌన్సిలర్లు బాహా బాహీకి దిగారు. మంగళవారం జరిగిన సమావేశం లో ఆరు ఎజెండాలను ప్రవేశపెట్టగా.. దానిపై చర్చిం చకుండానే పాస్‌ అని చైర్‌పర్సన్‌ అనూష ప్రకటించి వెళ్లిపోవడాన్ని నిరసిస్తూ ఆమె చాంబర్‌ ఎదుట బీజేపీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. నీటి సమస్య పై చర్చకు తమకు అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఖాళీ బిందెలతో బైటాయించారు. చైర్‌పర్సన్‌ రాజీ నామా చేయాలంటూ నినాదాలు చేశారు. అంతకు ముందు బీజేపీ, కాంగ్రెస్‌ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ జరిగింది. మాటామాట పెరిగి ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరు కౌన్సిలర్లు గల్లాలు పట్టు కొని కొట్టు కునేందుకు యత్నించగా.. తోటి కౌన్సి లర్లు వారిని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసు కున్న వన్‌టౌన్‌ సీఐ సునీల్‌కుమార్‌, ఎస్‌ఐలు అశోక్‌, నాగ్‌ నాథ్‌ అక్కడికి చేరుకుని కౌన్సిలర్లను సముదా యించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ నాయ కుడు పాయల శరత్‌ వచ్చి కమిషనర్‌ రాజును నిలదీ యడంతో పోలీసులు ఆయనను నిలువరిం చారు. దీంతో పోలీసులు, పాయల శరత్‌ మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం డీఎస్పీ జీవన్‌రెడ్డి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. చాంబర్‌లో ఉన్న చైర్‌పర్సన్‌తోపాటు కౌన్సిలర్లను పోలీసుల బందోబస్తు నడుమ బయటకు పంపించారు.

నీటి సమస్యపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదు
తమకు నీటి సమస్యపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదని బీజేపీ కౌన్సిలర్‌ ధోని జ్యోతి అన్నారు. ఎజెండాలోని ఐదో అంశమైన తాగునీటిపై చర్చ జరు గుతుండగా.. తాను ప్రశ్నించే ప్రయత్నం చేయగా మధ్యలోనే చైర్‌పర్సన్‌ తనను నిలువరించి ఎజెండా పాస్‌ అని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఎజెండా లో ఉన్న అంశంపై చర్చించడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదన్నారు. బీజేపీ 21మంది కౌన్సిలర్ల మాట కూడా వినకుండా పోడియం వదిలి వెళ్లిపో యారన్నారు. తాము ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతిని ధులమని, ప్రస్తుతం నీటి ఎద్దడి ఉందని దీనిపై తమకు మాట్లాడటానికి ఎందుకు అవకాశం ఇవ్వ లేదని ప్రశ్నించారు.

మున్సిపల్‌ను పూర్తి ప్రక్షాళన చేస్తాం : చైర్‌పర్సన్‌ బండారి అనూష
కౌన్సిల్‌ సమావేశం ఉదయం 11 గంటలకు అని మూడ్రోజుల ముందే సమాచారాన్ని అందించా మని, తాము 15 నిమిషాలు ముందుగానే వచ్చినట్టు చైర్‌పర్సన్‌ బండారి అనూష తెలిపారు. బీజేపీ కౌన్సిలర్లు సమావేశానికి ఆలస్యంగా వచ్చారన్నారు. ఎమ్మెల్యే హాజరు కావడంతో ఆయనకు 45 నిమిషా లు కేటాయించామన్నారు. అయినా బీజేపీ నాయకు లు గొడవ చేయాలనే ఆలోచనతోనే నిరసన తెలి పా రని ఆరోపించారు. మహిళ అని కూడా చూడ కుండా రౌడీయిజం చేస్తున్నారన్నారు. రెండున్నరేండ్ల పాటు ఎమ్మెల్యే అధికారంలో ఉండి ఏం చేశారో బీజేపీ కౌన్సిలర్లు చెప్పాలన్నారు. తరువాత తాను అన్నింటికీ సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఏం జరిగిందో తనకు తెలియదని, ఇప్పటి నుంచి వేరే లెక్క ఉంటుందని అన్నారు. మున్సిపల్‌ను పూర్తి ప్రక్షాళన చేస్తానని తెలిపారు. బీజేపీ కౌన్సిలర్లు రౌడీయిజం చేస్తే తాము మాత్రం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతా మన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -