Wednesday, March 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకవిత అరెస్ట్‌.. హైదరాబాద్‌కు తరలింపు

కవిత అరెస్ట్‌.. హైదరాబాద్‌కు తరలింపు

- Advertisement -

– వెలుగుమట్ల భూదాన్‌ బాధితుల పక్షాన నిరవధిక దీక్షకు ఆటంకం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

ఖమ్మంలోని అంబేద్కర్‌ భవన్‌లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా డీఎస్పీ అధ్యక్షులు విశారదన్‌ మహరాజ్‌తో కలిసి సోమవారం రాత్రి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్‌ చేశారు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని పోలీసులు హైదరాబాద్‌ తరలించారు. అరెస్టు చేసినా దీక్ష కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకూ దీక్ష సాగిస్తానని అన్నారు. ప్రభుత్వం దిగివచ్చి కూల్చేసిన చోటనే బాధితులకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మొత్తం 600 మంది పోలీసులు దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టి అరెస్టు చేయడాన్ని ఆమె ఖండించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -