– అప్పటి వరకు నిరవధిక నిరాహారదీక్ష :కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు అక్కడే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి ఖమ్మంలో నిరాహారదీక్ష ప్రారంభించిన ఆమెను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఆమె హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తన దీక్షను కొనసాగించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు దీక్ష ఆపేది లేదని హెచ్చరించారు. భూదాన్ భూములను ఆక్రమించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. వెలుగుమట్లలో 62 ఎకరాల భూదాన్ భూములు పేదలకిచ్చినవేనని తెలిపారు. పరీక్షల సమయంలో అర్థరాత్రి బుల్డోజర్లతో 750 ఇండ్లను కూలగొట్టారని తెలిపారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల సమయంలో విద్యార్థులున్న ఇండ్లను కూడా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, జాగృతి, ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్‌తో కలిసి సంయుక్తంగా ఆందోళన చేపట్టినట్టు తెలిపారు. వెలుగుమట్లలో ఏం జరిగిందో కాంగ్రెస్ అగ్రనేత రాజీవ్ గాంధీ తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమి కాని చోట నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని ఆమె ప్రశ్నించారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని కవిత తెలిపారు.
వెలుగుమట్లలో బాధితులకు ఇండ్లు ఇవ్వాల్సిందే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



