సోమవారం 335.89 మిలియన్ యూనిట్ల సరఫరా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర చరిత్రలో గరిష్ట విద్యుత్ డిమాండ్ సోమవారం నమోదయ్యిందని తెలంగాణ విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది మార్చి 9న 335.19 మిలియన్ యూనిట్ల గరిష్ట డిమాండ్ నమోదు కాగా, ఈ ఏడాది అదే రోజున 335.89 మిలియన్ యూనిట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేసినట్టు తెలిపింది. ఏప్రిల్, మే నెలల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నప్పటికీ, అందుకు సిద్ధంగా ఉన్నామని విద్యుత్ శాఖ వెల్లడించింది. వేసవి డిమాండ్‌కు కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దష్టి సారించినట్టు పేర్కొంది. డిమాండ్‌కు తగ్గట్టుగా నాణ్యమైన విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలకు అందిస్తుండటం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగులను అభినందించారు.
రాష్ట్ర చరిత్రలో గరిష్ట విద్యుత్ వినియోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


