మద్నూరు ఎస్సై మోహన్ రెడ్డి
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం, జూనియర్ కళాశాలలో మోడల్ రూప్వే బ్రిడ్జి నిర్మించడం, ప్రాజెక్ట్ వర్క్ చేయడం వంటి కార్యక్రమాలను ఎస్సై మోహన్ రెడ్డి ప్రారంభించారు. భారత్ స్కౌట్ అండ్ గైడ్ యూనిట్ ఛత్రపతి శివాజీ ట్రూప్ విద్యార్థులు ప్రదర్శించిన స్కౌట్ విన్యాసాలను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. విద్యార్థులు దేశంపట్ల, జనులపట్ల సమాజం పట్ల భగవంతుని పట్ల భక్తి భావమును కలిగి ఉండాలన్నారు.
విద్యతోపాటు శారీరక మానసిక బలమును చేకూర్చడం కోసం స్కౌట్ అండ్ గైడ్ శిక్షణలు చాలా ఉపయోగపడతాయని, వ్యక్తిత్వ వికాసమునకు దోహదము చేస్తాయని అన్నారు. క్యాంపుల నిర్వహణలో భాగంగా వృద్ధులను ప్రేమించాలని, ప్రతి ఒక్కరిని గౌరవంగా చూడాలని, పెద్దవారిని పూజించాలని అన్నారు. అవకాశము దొరికినప్పుడు జాతర, గ్రామదేవతల ఉత్సవాల్లో విద్యార్థులు వాలంటీర్గా సేవలను అందించాలన్నారు. సకల జీవుల పట్ల ప్రేమను చూపించాలన్నారు.
ప్రిన్సిపాల్ ఏ సుధాకర్,వైస్ ప్రిన్సిపాల్, ప్రముఖ పద్యకవి డా బి.వెంకట్, స్కౌట్ మాస్టర్ యస్.నరహరిప్రసాద్ లు మాట్లాడుతూ – దేశభక్తిని విద్యార్థులు పెంచుకోవాలన్నారు. భారత్ స్కౌట్ అండ్ గైడ్ యూనిట్ విద్యార్థులు – జగదీష్ ,వెంకట్ ,రామకృష్ణ, కార్తిక్ , హర్షతేజ( 9 వతరగతి), సాయితేజ, సాయి కృష్ణ, దేవాన్ష్, గణేశ్, వైభవ్, గబ్బర్ సింగ్ , పంకజ్ కుమార్, విక్రమ్, హర్షవర్ధన్, మనోహర్, దినేష్, రెహాన్ (8వ తరగతి), జశ్వంత్, దేవ, అవంత్, సుశాంత్ ,రమేశ్, రిషికేశ్, కార్తీక్, మణితేజ, జ్ఞానేశ్వర్, హరిప్రసాద్ , ప్రవీణ్(6 వ తరగతి) ,డి.కృష్ణ, పి.కృష్ణ, చంద్రబాన్, విశాల్ 6 వ తరగతి)లు పాల్గొని రోప్ వే విన్యాసాలను ప్రదర్శించారు. ఉపాధ్యాయులు-సుమన్ గణేశ్, రాము సంతోశ్, నాగరాజు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



