Friday, July 17, 2026
E-PAPER
Homeఆటలుతొలిసారి జపాన్ ఓపెన్‌ సెమీస్‌కు పీవీ సింధు

తొలిసారి జపాన్ ఓపెన్‌ సెమీస్‌కు పీవీ సింధు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తన సుదీర్ఘ కెరీర్‌లో తొలిసారిగా భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ సెమీఫైనల్స్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రత్యర్థి నొజుమి ఒకుహర వైదొలగడంతో సింధుకు వాకోవర్ లభించింది. రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధు, జపాన్ ఓపెన్‌లో ఇదే ఆమె అత్యుత్తమ ప్రదర్శన. సెమీఫైనల్స్‌లో ఆమె ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యుఫైతో తలపడనుంది. 15 ఏళ్ల తర్వాత భారత మహిళా షట్లర్ ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరడం విశేషం. గతంలో సైనా నెహ్వాల్ 2011లో సెమీస్‌కు చేరి ఓటమిపాలైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -