నవతెలంగాణ-హైదరాబాద్: జులై 20 న సీజేపీ తలబెట్టబోయే శాంతియుత యాత్ర వరకూ తాను ఎట్టిపరిస్థితుల్లో ప్రాణాలతో ఉంటానని ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ అన్నారు. తన ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో ఈ రోజు శుక్రవారం ఆయన మాట్లాడారు. నీట్ లీకేజ్‌కు నిరసనగా జులై 20న పార్లమెంట్ వరకూ చేపట్టబోయే శాంతియుత యాత్రలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
నీట్ లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో మరికొన్ని డిమాండ్లు కోరుతూ సోనమ్ వాంగ్ చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు. సుదీర్ఘ ఉపవాసం వల్ల ఆయన శరీరంలోని కొవ్వు, కండరాలు కరిగిపోతున్నాయి. దీనివల్ల ఆయన ఇప్పటికే 9 కిలోల బరువు తగ్గారు.
ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు కూడా స్పందించింది. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించింది. ఒకవేళ ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తే తక్షణమే అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలని కోర్టు స్పష్టం చేసింది.



