నవతెలంగాణ కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లి, బషీరాబాద్, నాగాపూర్, హాస కొత్తూర్, ఉప్లూర్ గ్రామాల్లో శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ సందర్శించి పరిశీలించారు. గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి కుండిలను, పూల కుండీలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.పనికి రాని టైర్లు, బకిట్లలో, త్రాగిన కొబ్బరి బొండాలలో నీళ్లు నిల్వ ఉంచకూడదన్నారు.
ఖాళీ చేసి పనికి రాని వస్తువులను పడేయలని, వాడకుండా ఉన్న కూలర్లలో ఉన్న నీళ్లను తీసివేసి శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారుు. రోజుల తరబడి నిల్వ ఉన్న నీటిలో లార్వా, దోమలు వృద్ధి చెంది ఆరోగ్యానికి హాని చేస్తాయని వివరించారు.ఇంట్లోని చెత్తను వీధిలో, మురికి కాలువలలో పాడేయకుండా ఇంటిలోనే తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా గ్రామ పంచాయతీ ద్వారా అందించిన చెత్తబుట్టలో నిల్వ ఉంచుకొని గ్రామపంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులోనే వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.



