Friday, March 13, 2026
E-PAPER
Homeఖమ్మంలక్ష్యం ఉంటే విజయం సులభం 

లక్ష్యం ఉంటే విజయం సులభం 

- Advertisement -

– పీఎం శ్రీ విద్యార్థులకు ఎస్ఐ అఖిల కెరీర్ గైడెన్స్
నవతెలంగాణ – అశ్వారావుపేట 

జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అశ్వారావుపేట పోలీస్ సబ్‌ ఇన్స్పెక్టర్ కే.అఖిల అన్నారు.  గురువారం పీఎం శ్రీ ఎంపీయూపీఎస్ నారంవారిగూడెం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పున్నం చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నిర్వహించిన కెరీర్ గైడెన్స్,ఇంటరాక్షన్ విత్ రోల్ మోడల్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

విద్యార్థులు నిరంతరం శ్రమిస్తే అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధించవచ్చని తెలిపారు.18 సంవత్సరాల లోపు పిల్లల రక్షణ కోసం పోక్సో చట్టం అమల్లో ఉందని, దాని గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని కాల్స్, లింక్స్ ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. కౌమార దశలో తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండి తల్లిదండ్రులు, గురువుల సూచనలు పాటించాలని సూచించారు.

ప్రధానోపాధ్యాయులు పున్నం చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే లక్ష్య సాధనకు పునాది పడాలని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే విజయం సాధ్యమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బండి శ్రీనివాసరెడ్డి, రేణుక, కొచ్చర్ల శ్రీనివాసరావు, ఆశిక్ ఆలం, సోయం రవిబాబు, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను ఉపాధ్యాయులు సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -