Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాలభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం

గ్రామాలభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
గ్రామీణాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని మండల అభివృద్ధి అధికారి ఉమాదేవి అన్నారు. నూతనంగా ఎన్నికైన 122 వార్డు సభ్యులకు రెండవ విడత 5 రోజుల శిక్షణకార్యక్రమం శుక్రవారం ముగిసింది.భాగంగా మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఈ సందర్భంగా ఎంపీడీఓ ఉమా దేవి మాట్లాడుతూ వార్డుమెంబర్లకు పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకమైన బాధ్యతలు కట్టబెట్టిందన్నారు. వార్డుల్లో సమస్యలు గుర్తించి పరిష్క రించడంలో చురుగ్గా వ్యవహరించాలని సూచించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరేలా కృషి చేయాలన్నారు. పంచాయతీరాజ్ చట్టం, గ్రామసభల నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలు, అభివృద్ధి పథకాల అమలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై వార్డు సభ్యులకు మాస్టర్ ట్రైనర్ల ద్వారా అవగాహనకల్పిం.చారని చెప్పారు. అనంతరం వార్డుమెబర్లకు ట్రైనింగ్ సర్టిఫికెట్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓవిజయ్ కుమార్ , ట్రైనర్లు నిరంజన్ , రాజశేఖర్ , కాజా,సైదా నాయక్ మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -