నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్లలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులతో 2026 సంవత్సరం క్యాలెండర్ పాఠశాల ఆవిష్కరణ చేయడం అనేది జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా ఏఎమ్ఓ విజయ్ పాల్ హాజరై మాట్లాడారు క్యాలెండర్ ముఖ్య ఉద్దేశంసై అవగాహన కల్పించారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా పని చేస్తాయని వారి యొక్క తల్లిదండ్రులకు,సమాజానికి తెలియజేయడం కోసం పాఠశాల తరఫున చిన్న ఒక ప్రయత్నమే క్యాలెండర్ ఆవిష్కరణ అన్నారు.విద్యార్థుల కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు చూసి వారి బంధువులకు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాల బలవపటానికి సహాయపడుతుందన్నారు.అదేవిధంగా ఎక్కువగా ఎన్రోల్మెంట్ జరగడానికి ఆస్కారం ఉంటుందని ఉద్దేశంతో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ బాబు,మాజీ కాంప్లెక్స్ హెచ్ఎం కుమార్,మహేందర్ సార్ గోపీనాథ్,మహేష్ ,సిఆర్పిలు,ఉపాధ్యాయురాలు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.



