Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరిన జనం

గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరిన జనం

- Advertisement -

బుక్ చేస్తేనే సిలిండర్
నవతెలంగాణ – నసురుల్లాబాద్

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడనుందనే ప్రచారంతో బాన్సువాడ పట్టణంలో  వినియోగదారులు వంట గ్యాస్ కోసం పరుగులు తీస్తున్నారు.  పట్టణంలో ఓ ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట ఉదయం నుంచి గ్యాస్ సిలిండర్లతో బారులు తీరారు. గ్యాస్ కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉండడంతో చాలామంది నేరుగా ఏజెన్సీ ముందుకే సిలిండర్లతో తరలివచ్చారు. వినియోగదారులు ఎక్కువ మెత్తంలో గ్యాస్ బుకింగ్ చేసుకుంటుండటంతో సర్వర్‌ సమస్య తలెత్తుతుందని డీలర్లు చెబుతున్నారు. గ్యాస్‌ బుకింగ్‌ తర్వాత సిలిండర్‌ డెలివరీకి రెండు రోజుల సమయం పడుతుండటంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇది వరకు రోజుకు  సగటున అన్ని కంపెనీలు కలిపి 500 గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేయగా..అదే  బీర్కూర్ నసురుల్లాబాద్ మండలాల్లో రెండు  కంపెనీల సిలిండర్లు సుమారు 150 సిలిండర్లు సరఫరా చేసేవారు. కొరత అనే ప్రచారంతో ప్రస్తుతం దానికి రెట్టింపు సరఫరా చేయాల్సి రావడంతో ఆలస్యమవుతుందన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -