– సామాజిక సేవలో నిమగ్నమైన కౌన్సిలర్ ప్రసాద్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజాసేవ చేయాలనే తపనతో రాజకీయాలకు వచ్చిన వ్యక్తులు అదే ధ్యాసలో ఉంటారు.కేవలం రాజకీయం చేయడానికి వచ్చిన వారు పైరవీలు, మధ్యవర్తిత్వం వహిస్తుంటారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ ఒకటో వార్డు కౌన్సిలర్ డేరంగుల ప్రసాద్ తనకు చేతనైన, తోచిన సహాయం చేస్తూ సామాజిక సేవలో నిమగ్నమవుతున్నారు. తన వార్డు పరిధిలో ఉన్న శ్రీ గౌతమి స్కూల్ లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం ప్యాడ్లు, పెన్నులు, పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాలలో మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని నూటికి నూరు శాతం ఫలితాలు సాధించి పాఠశాలకు,అశ్వారావుపేట పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యతోనే మంచి భవిష్యత్తు నిర్మించుకోవచ్చని ఆయన విద్యార్థులకు సూచించారు.
అలాగే విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొఠారి లక్ష్మి, కరస్పాండెంట్ కొఠారి చలపతి రావు, యార్గగడ్డ కన్నారావు, స్థానిక ప్రజలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో అవసరమైన సామగ్రి అందించినందుకు పాఠశాల యాజమాన్యం కౌన్సిలర్ దేరంగుల ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు.



