నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ తరగతులు శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. ఈనెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు రెండవ బ్యాచ్ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ రెండో విడత శిక్షణ తరగతుల్లో కోనాపూర్, బషీరాబాద్,హాస కొత్తూరు, కోన సముందర్, ఉప్లూర్, కమ్మర్ పల్లి గ్రామాలకు చెందిన 72 మంది వార్డు సభ్యులు శిక్షణ తరగతులకు హాజరయ్యారు.శిక్షణ తరగతులకు హాజరైన వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టంపై శిక్షకులు రామకృష్ణ, స్వప్న, మల్లేష్, మహేందర్ శిక్షణను ఇచ్చారు. ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టంలో వార్డు సభ్యులకు నిర్దేశించిన విధులు, బాధ్యతల గురించి క్షుణంగా వివరిస్తూ శిక్షణను ఇచ్చారు.
శిక్షణ తరగతుల్లో నేర్పించిన అంశాలు తమ ఐదు సంవత్సరాల పదవి కాలంలో ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా పలువురు వార్డు సభ్యులు పేర్కొన్నారు. శిక్షణ తరగతులు ముగింపు సందర్భంగా వార్డు వార్డు సభ్యులకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజా శ్రీనివాస్ చేతుల మీదగా సర్టిఫికెట్లను అందజేశారు. కాగా ఈనెల 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఆరు రోజులు పాటు మొదటి బ్యాచ్ శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ శిక్షణ తరగతుల్లో దొమ్మరి చౌడు తండా, అమీర్ నగర్, ఈనాయత్ నగర్, కొత్త చెరువు తండా, నాగాపూర్, నర్సాపూర్, చౌట్ పల్లి, రాజరాజేశ్వరి నగర్ గ్రామాలకు చెందిన 66 మంది వార్డు సభ్యులు హాజరయ్యారు. వీరికి కూడా శిక్షణానంతరం ముగింపు రోజు సర్టిఫికెట్లను అధికారులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, మండల పరిషత్ కార్యాలయ సూపరిండెండెంట్ చంద్రశేఖర్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, కారోబర్లు, ఎంపీడబ్ల్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



