నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం గంగారం గ్రామపంచాయతీ పరిధిలో చెరువులు, కుంటల వద్ద శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ డ్రై డేను శుక్రవారం నిర్వహించారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా చెరువులు, కుంటల పరిసర ప్రాంతాలలో పేరుకుపోయిన చెత్తను తొలగించి, నీటి నిల్వలు కలుషితం కాకుండా చర్యలు తీసుకున్నారు. గ్రామంలో పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో గంగారం గ్రామ సర్పంచ్ శోభరాణి మాట్లాడుతూ గ్రామంలో చెత్త పేరుకుపోకుండా ప్రతి వారమూ డ్రై డే నిర్వహించడంతో పాటు ప్రజలు కూడా పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నగేష్, కార్యదర్శి బిరెల్లి కర్ణాకర్, వార్డు సభ్యులు నరేష్, మహేందర్, రాజు కుమార్, సమ్మయ్య, సమ్మక్క, సరోజన తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా శుభ్రత కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సహకారం అందించారు.



