Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థినీలకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేసిన సర్పంచ్

విద్యార్థినీలకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేసిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామం పంచాయతీ పరిధిలో గల కేజీబీవీ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో పరీక్ష ప్యాడ్లు మరియు వెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన వితరణ కార్యక్రమంలో బస్వాపూర్ సర్పంచ్ ముఖ్య రమణ సురేష్ గొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థిని పరీక్ష రాస్తున్నప్పుడు భయాందోళనకు గురికాకుండా నిర్భయంగా రాయాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ మంచి మార్కులు సాధించి జిల్లాలోని ఉత్తమ కస్తూర్బా పాఠశాలగా పేరు ప్రఖ్యాతలు ఇచ్చే విధంగా తమవంతుగా కృషి చేయాలని అన్నారు.  ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే పేద విద్యార్థిని, విద్యార్థులకు మండలంలోని ఏదైనా ఒక పాఠశాలలను ఎంపిక చేసుకొని సొంత ఖర్చులతో విద్యార్థులకు సంబంధించిన వస్తువులను వితరణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా శుక్రవారం నాడు కేజీబీవీ విద్యార్థినులకు పరీక్ష అట్టలు, పెన్నులు వితరణ చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమణ,  ఉప సర్పంచ్ , మాజీ సర్పంచ్ సురేష్ గొండ, జిపి కార్యవర్గ సభ్యులు, జిపి కార్యదర్శి  భరద్వాజ్ , కేజీబీవీ ఉపాధ్యాయునిల బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -