Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆక్సిజన్ పార్కులో ఫ్రైడే - ఫ్రైడేలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఆక్సిజన్ పార్కులో ఫ్రైడే – ఫ్రైడేలో పాల్గొన్న ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
జుక్కల్ మండల కేంద్రంలోని ఆక్సిజన్ పార్కులో ఫ్రైడే-  డ్రై డే కార్యక్రమంలో భాగంగా జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు శుక్రవారం స్థానిక సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ తో కలసి పాల్గొన్నారని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలోని 30 గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి శుక్రవారం గ్రామాలలో పరిశుభ్రత పాటించాలని అన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచినప్పుడే ప్రజల ఆరోగ్యం కాపాడిన వారు తమ వంతు బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలని అన్నారు.

గ్రామాలలో చెత్తాచెదారం గ్రామపంచాయతీ ట్రాక్టర్లలో తరలించి గ్రామ బయట నిర్మాణం చేసిన చెత్త గుంతలలో వేయాలని తెలిపారు. మండల స్థాయి అధికారులతో పాటు గ్రామీణ స్థాయి ప్రజాప్రతినిధులను ప్రాతినిధ్యం వహించి వారి ద్వారా ఈ కార్యక్రమాలు ప్రజలలో తీసుకువెళ్లాలని గ్రామస్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తో పాటు గ్రామ సర్పంచ్ సావిత్ర , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి గౌడ్, మాజీ సర్పంచ్ బొంపెల్లి రాములు సేట్, మాజీ విండో చైర్మన్ శివ నంద్ , జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, యువజన సంఘం నాయకులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -