Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరీక్షా క్రేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలి: ఎంఈఓ

పరీక్షా క్రేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలి: ఎంఈఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
పదో తరగతి పరీక్ష కేంద్రానికి విద్యార్థులు కనీసం అరగంట ముందుగా చేరుకోవాలని మండల విద్యాశాఖ అధికారి తిరుపతయ్య సూచించారు. జుక్కల్ మండలంలో ఈ నెల 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 16వ తేదీతో పూర్తవుతాయి. ఏటా కనీసం 10 శాతం మంది విద్యార్థులు చివరి 5 నిమిషాల్లో పరీక్షా కేంద్రానికి చేరుకుంటున్నారని, సకాలంలో కేంద్రంలోకి ప్రవేశిస్తామో? లేదోనన్న, టెన్షన్‌ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని అన్నారు.

ఆ ప్రభావం పరీక్ష రాయడంపై పడుతుందని ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఈ పరిస్థితి లేకుండా విద్యార్థులు కనీసం అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకునేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని ఎంఈఓ కోరారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష మొదలవుతుందని, విద్యార్థులను 9.35 వరకు లోపలికి అనుమతిస్తామని పేర్కొన్నారు. పరీక్షకు కనీసం ఒక రోజు ముందు కేంద్రాన్ని చూసుకొని రావాలని, దూర ప్రాంత గ్రామాల నుండి విద్యార్థులు, పరీక్ష రాసేవారు దాన్ని కచ్చితంగా పాటించడం మంచిదని సూచించారు.

కాపీయింగ్‌ జరగకుండా 144 ఫ్లయింగ్‌ స్క్వాడ్లతో పాటు సిటింగ్‌ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మండల పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -