నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాల్లో గృహావసరాలకు ఎల్.పి.జి సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని,ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి,జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎల్పిజి గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కమిటీ సమావేశం ఏర్పాటు చేయగా.. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లడుతూ జిల్లాలో గృహావసరాలకు, ప్రభుత్వ పాఠశాలలకు,వసతి గృహాలకు , అంగన్వాడి కేంద్రాలకు, ఆసుపత్రులకు సిలిండర్ కొరత రాకుండా చూసుకోవా లని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు సూచించారు.జిల్లాలో గృహావసరాలకు ఎల్.పి.జి సిలిండర్లకు ఎలాంటి కొరత లేదనీ, వాణిజ్య సిలిండర్లకు కొంత ఇబ్బంది ఉంది తప్ప, గృహవసరాలకు ఎలాంటి కొరత లేదు కాబట్టి
ప్రజలు అనవసరంగా ఆందోళన చెంది అవసరానికి మించి అడ్వాన్సు గా బుకింగ్ చేసుకోవద్దనీ అన్నారు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ప్రస్తుతం ఉన్న సిలిండర్ల నిల్వలు, ఇప్పటి వరకు వచ్చిన బుకింగ్ లు , ఏజెన్సీల నుండి రోజుకు వచ్చే సిలిండర్ల వివరాలను డిస్ట్రిబ్యూటర్లతో అడిగి తెలుసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లు వారి వద్ద ఉన్న సిలిండర్ల వివరాలు వెల్లడిస్తూ గృహావసరాలకు వాడే సిలిండర్లు ఎప్పటిలాగానే మాకు సప్లై అవుతున్నాయని, కేవలం వాణిజ్య సిలిండర్లు తప్ప గృహఅవసరాలకు ఎలాంటి సమస్య లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రానున్న రోజుల్లో సైతం గృహాఅవసరాలకు గానీ విద్యాలయాలు, వసతి గృహాలు, కే.జి.బి.వి లు, అంగన్వాడీ కేంద్రాలకు, ఆసుపత్రి,సిలిండర్ల సమస్య రాకుండా చూసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లను.ఆదేశించారు డిమాండు ను బట్టి ఎప్పటికప్పుడు సిలిండర్లు ఆర్డర్ పెట్టీ తెప్పించుకోవాలని, ఏమైనా ఇబ్బందులు వస్తె తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లాడుతూ సిలిండర్ల సరఫరా చేసే టైం లో పోలీస్ వారి ప్రొటెక్షన్ అవసరం కావాలి అంటే ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సమాజిక ప్రసార మాధ్యమాలలో గ్యాస్ సిలిండర్లపై అసత్య ప్రచారాలు చేయవద్దన్నారు. జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆధ్వర్యంలో కొనసాగుతుందని 9281423623 నెంబర్ సంప్రదించవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ, ఆర్ డి ఓ లు కృష్ణా రెడ్డి,శేఖర్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి,సివిల్ సప్లై అధికారి రోజా రాణి , గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు.



