ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి విద్యుత్ తీగలు అడ్డంకి
నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతున్నా, స్వర్ణ గ్రామానికి చెందిన దేవుళ్ల హంస రాములు ఆరు నెలముందు ఇందిరమ్మ ఇళ్లు పనులు ప్రారంభించారు. బేస్మెంట్, రెండు వైపుల గోడలు కట్టరు ఇల్లు స్థలం మీదుగా వెళ్తున్న కరెంట్ తీగలు (విద్యుత్ తీగలు) నిర్మాణ పనులకు ఆటంకంగా మారాయి. ఇంటి స్థలం పైన విద్యుత్ తీగలు ఉండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా నిర్మాణం ఆగిపోయింది. దీని వల్ల మేస్త్రీలు, కూలీలు పనులు చేయడానికి వెనుకాడుతున్నారు. మండల విద్యుత్ అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఇప్పటికీ తీగలు తొలగించలేదని వాపోయారు. ప్రజా ప్రతినిధులు మండల అధికారులు స్పందించి విద్యుత్ తీగలు తొలగించి స్వంతింటి కళ వేరవేర్చాలని కోరారు.
స్వంతింటి కళ నెరవేరేదేపుడో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



