నవతెలంగాణ – రాయికల్
రోగాల నిర్ధారణలో ల్యాబ్ టెక్నీషియన్లు కీలక పాత్ర పోషిస్తారని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొత్తపెళ్లి రంజిత్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవం సందర్భంగా రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్లు మోసారపు సంతోష్, అందె రంజిత్,మోసారపు శ్రీధర్, మామిడాల ప్రణయ్, రియాన్లను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్లు ఆరోగ్య వ్యవస్థలో కనిపించని యోధులని అన్నారు. వారి కృషి వల్లే రోగ నిర్ధారణ వేగంగా జరిగి అనేక ప్రాణాలు కాపాడబడుతున్నాయని పేర్కొన్నారు. వారి సేవలను గుర్తిస్తూ అంతర్జాతీయ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి బెక్కం తిరుపతి, డయాబెటిక్ కోఆర్డినేటర్ బత్తిని భూమయ్య, డీసీ మ్యాకల రమేష్, చార్టెర్డ్ ప్రెసిడెంట్ మోర హన్మాండ్లు, లయన్స్ క్లబ్ సభ్యులు మచ్చ శేఖర్, దాసరి గంగాధర్, వాసం ప్రసాద్, సుధావేణి మురళి తదితరులు పాల్గొన్నారు.



