నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం ముందు గ్రామ పంచాయితీ కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులందరికీ రూ.26,000 వేతనం అందించాలనీ, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలనీ, పెండింగ్ జీతాలు అందించాలనీ, రెండో పి ఆర్ సి గ్రామపంచాయతీ కార్మికులకు వర్తింపచేయాలనీ వారు డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రం అందించారు. ధర్నాలోజిల్లా ఉపాధ్యక్షులు ముశం రమేష్ ,యూనియన్ జిల్లా అధ్యక్షులు బూర శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి మల్యాల నరసయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, జిల్లా నాయకులు ఎలిగేటి రాజశేఖర్, మండల నాయకులు గూడెం శ్రీనివాస్, రవి మల్లయ్య, బిక్షపతి, గంభీరావుపేట మండల అధ్యక్షుడు అంజయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



