Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆప్త మిత్రున్ని సన్మానించిన వేదం ట్యూషన్ అధ్యాపకుడు

ఆప్త మిత్రున్ని సన్మానించిన వేదం ట్యూషన్ అధ్యాపకుడు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ సూర్నార్ శకుంతల భర్త సూర్నార్ బాలును నిజామాబాద్ జిల్లా వాసి అయిన వేదం ట్యూషన్ అధ్యాపకుడు సన్మానించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ.. తన ఆప్తమిత్రుడైన వేదం ట్యూషన్ అధ్యాపకుడు చిన్ననాటి నుండి తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఈరోజు మా గ్రామానికి మా సతీమణిని సర్పంచ్ గా ఎన్నుకోవడంలో కీలకపాత్ర వహించారని అన్నారు. తనకున్న సమస్యలను వదులుకొని ఆప్త మిత్రులను ఆదుకోవడం, సన్మానించడం తనకి ఎంతో గౌరవం లభించిందని బాలు అన్నారు. ఈ కార్యక్రమంలో మహ్మదాబాద్ గ్రామానికి చెందిన పాలూరి యువ నాయకులు, వేదం  ట్యూషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -