భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్లో కూడా అద్భుతంగా కొనసాగుతోంది. టాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా ఇతర భాషల నుండి కూడా తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలను అందిస్తోంది. వారి డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘హ్యాపీ రాజ్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో కంపోజర్-హీరో జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించారు. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు.
‘మ్యాడ్’ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం ఇప్పటికే తమిళంలో పాజిటివ్ బజ్‌ను సృష్టిస్తోంది. రీఫ్రెషింగ్ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈనెల 27న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవుతుంది. అబ్బాస్, జార్జ్ మరియన్, గీతా కైలాసం, ప్రార్థన నాథన్, అదుర్చి అరుణ్, మధురై ముత్తు, దేవి మహేష్, సోఫాబాయ్ రసూల్ తదితరులు నటించిన ఈచిత్రానికి దర్శకత్వం- మరియా రాజా ఎలాంచెజియన్, నిర్మాత- జైవర్ద, సహ నిర్మాత – జైకాంత్ సురేష్, డీవోపీ-మధన్ క్రిస్టోఫర్, ఎడిటర్- ఆర్కే సెల్వ, సంగీతం- జస్టిన్ ప్రభాకరన్, ప్రొడక్షన్ డిజైనర్ – కుమార్ గంగప్పన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- విశ్రేత్ కెఎల్.
భిన్న కాన్సెప్ట్‌తో ‘హ్యాపీ రాజ్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



