Saturday, March 14, 2026
E-PAPER
Homeసినిమా'గుర్తుకొస్తున్నాయి'.. అందరికీ కనెక్ట్‌ అవుతుంది

‘గుర్తుకొస్తున్నాయి’.. అందరికీ కనెక్ట్‌ అవుతుంది

- Advertisement -

విరాజ్‌ అశ్విన్‌ హీరోగా, వినోద్‌ గాలి దర్శకత్వంలో శరత్‌ చంద్ర నాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘గుర్తుకొస్తున్నాయి’. యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, శివ నారాయణ నారిపెద్ది, ప్రియ దర్శిని రామ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్‌ గ్లింప్స్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాత నవీన్‌ యెర్నేని మాట్లాడుతూ,’శరత్‌కి గుడ్‌ లక్‌. కచ్చితంగా ఇది చాలా పెద్ద హిట్‌ అవ్వాలి. విరాజ్‌కి హ్యాపీ బర్త్డే. గ్లింప్స్‌ చాలా బాగుంది. డైరెక్టర్‌ వినోద్‌, టీమ్‌ అందరికీ ఆల్‌ ది వెరీ బెస్ట్‌. ఈటీవీ విన్‌ గత రెండు సంవత్సరాలుగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నారు.

మేము సంవత్సరానికి ఒక హిట్‌ తీయడానికి కష్టపడుతుంటే సంవత్సరానికి మూడు నాలుగు హిట్లు కొడుతున్నారు. ఈ విజయాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నితిన్‌, సాయి గ్రేట్‌ వర్క్‌ చేస్తున్నారు. ప్రస్తుతం 16 సినిమాలు, పలు వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నారు. మంచి ప్రతిభ ఉన్న వారికి ఈటీవీ విన్‌ గొప్ప వేదికగా నిలుస్తోంది. ‘గుర్తుకొస్తున్నాయి’ చాలా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఇది నాకు చాలా స్పెషల్‌ డే. నా బర్త్‌ డే రోజున గుర్తుకొస్తున్నాయి గ్లింప్స్‌ ప్రజెంట్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. మన జీవితంలో మనం చాలా జ్ఞాపకాలు క్రియేట్‌ చేసుకున్నాం. అవి భవిష్యత్తులో మనకు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు మొహం మీద నవ్వు వస్తుంది. అది ఎప్పుడు అలాగే ఉండాలి. గుర్తుకొస్తున్నాం కూడా జ్ఞాపకాల సమాహారం.

ఇది సొంతోష్‌ అండ్‌ అతని ఫ్రెండ్స్‌ ఫన్‌ రైడ్‌. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని హీరో విరాజ్‌ అశ్విన్‌ చెప్పారు. ఈటీవి విన్‌ బిజినెస్‌ హెడ్‌ సాయి కృష్ణ మాట్లాడుతూ,’ఈటీవీ నుంచి వచ్చే ప్రతి సినిమా డిఫరెంట్‌ జోనర్‌లో ఉంటాయి. ఫస్ట్‌ టైం నోస్టాల్జియ జోనర్‌లో వస్తున్నాం. ఇది చూసినప్పుడు మీకు కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి. అవి ఆనంద భాష్పాలు అవుతాయని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘మనం ఎవరినైతే మర్చిపోయామో వాళ్ళందర్నీ గుర్తు చేసుకోవడానికి వచ్చిన అవకాశం ‘గుర్తుకొస్తున్నాయి’ అని ఈటీవీ విన్‌ కంటెంట్‌ హెడ్‌ నితిన్‌ చక్రవర్తి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -