Saturday, March 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు

ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు

- Advertisement -

– ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ చిరు వ్యాపారస్తులపై కొరడా ఝుళిపించిన జీహెచ్‌ఎంసీ
నవతెలంగాణ – ముషీరాబాద్‌

హైదరాబాద్‌లోని కవాడిగూడలో ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చిరు వ్యాపారస్తులపై కొరడా ఝుళిపించారు. ప్రధాన రహదారికి ఇరువైపులా ఫుట్‌పాత్‌లపై అక్రమంగా డబ్బాలు ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారం నిర్వహిస్తుండగా వాటిని శుక్రవారం భారీ జేసీబీ సహాయంతో తొలగించారు. అయితే అక్కడే రోడ్లను ఆక్రమించి అక్రమంగా షట్టర్లు వేసుకుని వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి జీహెచ్‌ఎంసీ నిబంధనలు పాటించని వారిపై కూడా ఇదే విధంగా కూల్చివేతలు చేపట్టాలని, అందరికీ సమాన న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. కనీసం తమకు డబ్బాలను తొలగించే సమయం కూడా ఇవ్వకుండా వెంటనే వాటిని తొలగించడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -