Saturday, March 14, 2026
E-PAPER
Homeఆటలుఐదు పతకాలు ఖాయం

ఐదు పతకాలు ఖాయం

- Advertisement -

వరల్డ్‌ బాక్సింగ్‌ ఫ్యూచర్స్‌ కప్‌

బ్యాంకాక్‌ (థాయ్ లాండ్‌) : వరల్డ్‌ బాక్సింగ్‌ ఫ్యూచర్స్‌ కప్‌లో భారత యువ బాక్సర్లు కనీసం ఐదు పతకాలు ఖాయం చేశారు. గుంజన్‌, జోశ్రీ దేవి, అంబెకర్‌, చంద్రిక పుజారి, రాధామణిలు సెమీఫైనల్స్‌కు చేరుకుని కనీసం కాంస్య పతకాలు లాంఛనం చేసుకున్నారు. 48 కేజీల విభాగంలో గుంజన్‌ 5-0తో అజర్‌బైజాన్‌ బాక్సర్‌ను చిత్తు చేయగా, 54 కేజీల విభాగంలో జోశ్రీ దేవి నాకౌట్‌తో జపాన్‌ బాక్సర్‌ను చిత్తు చేసింది. 50 కేజీల విభాగంలో అంబెకర్‌ 4-1తో జపాన్‌ బాక్సర్‌పై గెలుపొందగా..51 కేజీల విభాగంలో చంద్రిక పుజారి నాకౌట్‌తో గెలుపొందింది. 57 కేజీల విభాగంలో రాధామణి 4-1తో ఇంగ్లాండ్‌ బాక్సర్‌పై విజయం సాధించింది. ఇదిలా ఉండగా, 60 కేజీల విభాగం క్వార్టర్స్‌లో సాహిల్‌ దుహాన్‌ 1-4తో ఫ్రాన్స్‌ బాక్సర్‌ డెవిడ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -