Saturday, March 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు విస్తరించాలి

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు విస్తరించాలి

- Advertisement -

– ఎఫ్‌పీఓలు కీలక పాత్ర పోషిస్తేనే అది సాధ్యం
– ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రానికి చెందిన వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులకు అంతర్జా తీయ మార్కెట్‌లో విస్తృత అవకాశాలు న్నాయనీ, ఈ నేపథ్యంలో ఎగుమతు లను విస్తరించాల్సిన అవసరముందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. ఫెడరేషన ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండిస్టీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని రెడ్‌ హిల్స్‌ లో గల ఖూచీ ఆడిటోరియంలో వ్యవ సాయ ఎగుమతులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లా డుతూ.. తెలంగాణలో ఉద్యానవన పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందనీ, పండ్లు, కూరగాయలు, పసుపు, మిర్చి వంటి పంటలకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మంచి డిమాండ్‌ ఉందని వివరించారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, కొత్త మార్కెట్‌ అవకాశాలు కల్పించడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు విస్తరించేం దుకు ఉత్పత్తుల గ్రేడింగ్‌, ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌, బ్రాండింగ్‌, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు అవసరమని నొక్కి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తోందనీ, ఖమ్మం జిల్లా బుగ్గపాడు వద్ద మెగా ఫుడ్‌ పార్క్‌ ద్వారా ఆధునిక ప్రాసెసింగ్‌ సదుపాయాలు, కోల్డ్‌ స్టోరేజ్‌, లాజిస్టిక్స్‌ మరియు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి అవకాశాలు కల్పించిందని వివరించారు. ఉద్యాన వన పంటల సరఫరా వ్యవస్థలు, ప్యాక్‌ హౌసులు, కోల్డ్‌ స్టోరేజ్‌ సదుపాయాలు మరియు లాజిస్టిక్స్‌ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తే రాష్ట్రం అంతర్జాతీయ మార్కెట్లలో మరింత ముందుకు వెళ్లగలదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయిల్‌ పామ్‌, వంటనూనెలపై దిగుమతి సుంకాలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాలపై రైతుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. అమెరికా లాంటి దేశాలతో వ్యవ సాయ వాణిజ్య ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా వ్యవహ రించాలన్నారు. అంతర్జాతీయ ఒప్పందాలు మన దేశ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగిం చకుండా ఉండాలని సూచించారు. ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌పీఓలు) వ్యవసాయ ఎగుమతుల విస్తరణలో కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఏపీఈడీఏ, డీజీఎఫ్‌టీ, ఇతర పరిశ్రమలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తోందన్నారు. విజన్‌ 2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -