Saturday, March 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరేవంత్‌రెడ్డి బినామీ వ్యాపారాలపై విచారణ జరపండి

రేవంత్‌రెడ్డి బినామీ వ్యాపారాలపై విచారణ జరపండి

- Advertisement -

– కేఎల్‌ఎస్‌ఆర్‌ కంపెనీపై సీబీఐ లేదా ఈడీతో సమగ్ర దర్యాప్తు చేపట్టాలి : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కేటీఆర్‌ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బినామీ వ్యాపారా లపై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. సీఎం రేవంత్‌రెడ్డి బినామీ కంపెనీ కేఎల్‌ఎస్‌ఆర్‌ కేసు విషయంలో సాక్ష్యాధారాలను మాయం చేయించడంపై ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. ఇటీవల హైకోర్టు విచారణ సందర్భంగా కేఎల్‌ఎస్‌ఆర్‌ కేసుకు సంబంధించిన సాక్ష్యాధా రాలు గల్లంతు అయ్యాయని అధికారులు చెప్పడం దురదృష్టకరమని తెలిపారు. ఆ కంపెనీ కేసుల విచారణ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సాక్ష్యాధారాలను తారుమారు చేసిందని పేర్కొన్నారు. బినామీ కంపెనీని కాపాడుకోవడం కోసం అధికార దుర్వినియోగానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్పడుతున్నారని తెలిపారు. దివాళా తీసిన ఆ కంపెనీకి రూ.2,500 కోట్ల కాంట్రాక్టులు అక్రమంగా కట్టబెట్టారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా పనులు, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ప్రాజెక్టులు, ప్రధాన రహదారి నిర్మాణ పనులు వంటి వాటిని ఆ కంపెనీకి ప్రభుత్వం అప్పగిం చిందని వివరించారు. దీంతో ప్రభుత్వ విధానాలపై అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే ఆ కంపెనీపైన ఆర్థిక అవకతవకలు, బ్యాంకులను మోసగించడం వంటి అనేక కేసులున్నాయని వివరించారు. ఆ కంపెనీకి, సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న అను బంధం అందరికీ తెలుసని పేర్కొన్నారు. గతంలో జరిగిన ఆదాయపు పన్ను విచారణలో ఆయన దీర్ఘకాలంగా ఉపయోగించిన టొయోట ల్యాండ్‌ క్రూజర్‌ (టీఎస్‌ 07 ఎఫ్‌ఎఫ్‌ 0009) వాహనం కేఎల్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ కంపెనీ పేరుతో నమోదై ఉందని వివరించారు. హైకోర్టులో విచారణ జరుగుతున్న రిట్‌ పిటిషన్‌ నెంబర్‌ 18267/2025 సందర్భంగా కీలకమైన సాక్ష్యాధారాలుగా ఉన్న స్వాధీనం చేసుకున్న పత్రాలు అధికారిక కస్టడీ నుంచి కనిపించకుండాపోయిన విషయం బయటపడిందని తెలిపారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారని గుర్తుచేశారు. తెలం గాణ రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం కూడా సాక్ష్యాధారాల భద్రతపై అనుమానాలను మరింత పెంచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనీ, విచారణ సంస్థలు, పోలీసు వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. కేఎల్‌ఎస్‌ఆర్‌ కంపెనీపై ఉన్న ఆర్థిక ఆరోప ణలు, కాంట్రాక్టుల కేటాయింపులో జరిగిన అక్రమాలు, మనీలాండరింగ్‌ అనుమా నాలపై పక్షపాతంలేకుండా సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో) వంటి దర్యాప్తు సంస్థలతో పూర్తిస్థాయి విచా రణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ లేఖ ప్రతులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘావాల్‌లకు కూడా ఆయన పంపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -