– బీసీ కమిషన్ చైర్మెన్ జి నిరంజన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ కమిషన్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పైళ్లను పరిష్కరిం చాలని కమిషన్ చైర్మెన్ జి నిరంజన్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్ర వారం హైదరాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయంలో దస్త్రాల పరిష్కారం, పరిసరాల శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్క్ష్మి కార్యదర్శి బి. బాల మాయా దేవి పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటి డైరెక్టర్ యు. శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి కె. మనోహర్ రావు, ప్రత్యేక అధికారి కుమారి ఎన్. సునీత, సెక్షన్ ఆఫీసర్లు జి. సతీష్ కుమార్, ఇర్ఫాన్ ఖాన్, రీసెర్చ్ ఆఫీసర్ జి. లక్ష్మినారాయణ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ కార్యాలయ ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని కోరారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న దస్త్రాలను పరిష్కరించాలని ఆదేశించారు.
పెండింగ్ పైళ్ల పరిష్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



