Saturday, March 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'ఉపాధి'పై 17న అఖిల భారత సదస్సు

‘ఉపాధి’పై 17న అఖిల భారత సదస్సు

- Advertisement -

జయప్రదానికి వ్యకాస పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఉపాధి హామీ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 17న ఢిల్లీలో అఖిల భారత సదస్సును నిర్వహించనున్నట్టు వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ వెల్లడించారు. ఈ సదస్సును జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్‌.వెంకటరాములుతో కలిసి వెంకట్‌ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. కొత్త చట్టాన్ని తీసుకురావటం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలపై యుద్ధాన్ని ప్రకటించిందని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో పాత చట్టం కావాలని కొట్లాడే పార్టీలు, పార్లమెంటులోని అన్ని పక్షాలను సదస్సుకు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఒకరోజుపాటు దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలనే అంశంపై సదస్సులో నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం వద్దు, పాత చట్టమే కావాలంటూ అసెంబ్లీలో తీర్మానించిందని గుర్తు చేశారు. అయితే అంతటితో చేతులు దులుపుకుందని విమర్శించారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం గడప దాటటం లేదని ఎద్దేవా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -